Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా డ్రీమ్ ప్రాజెక్టు రామాయణం... హాలీవుడ్ తరహాలో తీయాలని ఉంది!: ప్రభుదేవా

  • నేడు ప్రభుదేవా 45వ పుట్టిన రోజు
  • రామాయణం తీయాలని ఉంది
  • రామాయణం సినిమాకి 500 లేదా 600 కోట్ల బడ్జెట్ అవుతుంది
ప్రతి దర్శకుడికీ డ్రీమ్ ప్రాజెక్టు ఒకటి ఉంటుందని, తనకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉందని ప్రముఖ దర్వకుడు, కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా తెలిపాడు. నేడు 45వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామాయణం తెరకెక్కించాలని ఉందని అన్నాడు. హాలీవుడ్‌ సినిమా ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’ తరహాలో తీయాలని ఉందని చెప్పాడు. అయితే ఇప్పుడే కాదని చెప్పాడు.

 ఆ సినిమాకు ఎంత లేదన్నా 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని చెప్పాడు. ఆ బడ్జెట్ కు మన సినిమాలు చేరాలంటే ఐదేళ్లు పడుతుందని అంచనా వేశాడు. అప్పుడు రామాయణాన్ని తెరకెక్కిస్తానని ప్రభుదేవా తెలిపాడు. తనకు డ్యాన్స్‌, సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదని స్పష్టం చేశాడు. ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడు క్రికెట్‌ చూస్తానని చెప్పాడు. కాగా, ప్రభుదేవా నటించిన ‘మెర్య్కూరీ’, ‘గుళేబకావళి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, సల్మాన్‌ తో ‘దబాంగ్‌ 3’ సినిమా తీసేందుకు ప్రభుదేవా సన్నాహాలు చేస్తున్నాడు.
prabhudeva
movies
birth day
actor

More Telugu News